పరేడ్‌ గ్రౌండ్‌లో మోదీ సభ.. ఈ మార్గాల్లో రాత్రి 8 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు | Traffic Advisory Issued For PM Modi HYD Visit And Public Meeting In Parade Ground, Check Traffic Diversions Details Inside - Sakshi
Sakshi News home page

పరేడ్‌ గ్రౌండ్‌లో మోదీ సభ.. ఈ మార్గాల్లో రాత్రి 8 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు

Published Sat, Nov 11 2023 10:27 AM | Last Updated on Sat, Nov 11 2023 3:44 PM

Traffic Advisory Issued for PM Modi Hyderabad Visit Parade Ground - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం హైదరాబాద్‌కు వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తరపున ప్రచారం కోసం మరోసారి రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించబోయే మాదిగల విశ్వరూప మహాసభకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎస్టీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను 9 లేదా 10 శాతానికి పెంచే విషయంపైనా మోదీ ఏదైనా ప్రకటన చేయవచ్చునని ఊహాగానాలు సాగుతు న్నాయి.

ప్రధానిమోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో నేడు పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 వరకు పలుచోట్ల ట్రాఫిక్‌ మళ్లింపు, ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్‌ అదనపు (ట్రాఫిక్‌) పోలీసు కమిషనర్‌ జి.సుధీర్‌బాబు తెలిపారు. టివోలి క్రాస్‌ రోడ్స్‌ నుంచి ప్లాజ్‌ ఎక్స్‌ రోడ్స్‌ను ఊసివేయనున్నారు. పలు మార్గాల్లో దారిమళ్లింపులు ఉంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
సంబంధిత వార్త: నేడు తెలంగాణకు మోదీ

ట్రాఫిక్‌ మళ్లింపులు ఇలా..

►పంజాగుట్ట-గ్రీన్‌ల్యాండ్, బేగంపేట నుంచి సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ వరకు, తివోలి ఎక్స్‌ రోడ్స్, ప్లాజా ఎక్స్‌ రోడ్ల మధ్య రహదారులు మూసివేస్తారు. 
►సికింద్రాబాద్‌ సంగీత్‌ కూడలి నుంచి బేగంపేట వైపు వచ్చే ట్రాఫిక్‌ వైఎంసీఏ వద్ద క్లాక్‌ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్, సీటీఓ, రసూల్‌పురా, బేగంపేట వైపు వెళ్లా​​​​​‍లి
►బేగంపేట నుంచి సంగీత్‌ కూడలికి వచ్చే వాహనాలను సీటీఓ ఎక్స్‌ రోడ్స్‌ వద్ద బాలంరాయ్, బ్రూక్‌బాండ్, టివోలి, స్వీకార్‌ ఉప్‌కార్, వైఎంసీఏ, సెయింట్‌ జాన్స్‌ రోటరీ మీదుగా మళ్లిస్తారు
►బోయినపల్లి, తాడ్‌బండ్‌ నుంచి టివోలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను బ్రూక్‌ బాండ్‌ వద్ద సీటీఓ, రాణిగంజ్, ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
►కార్ఖానా, ఏబీఎస్‌ నుంచి ఎస్‌బీహెచ్‌-ప్యాట్ని వైపు వచ్చే ట్రాఫిక్‌ స్వీకార్‌-ఉప్‌కార్‌ వద్ద వైఎంసీఏ, క్లాక్‌ టవర్, ప్యాట్నీ లేదా టివోలి-బ్రూక్‌బాండ్, బాలంరాయ్, సీటీవో వైపు మళ్లిస్తారు.
►ప్యాట్నీ నుంచి వచ్చే వాహనాలకు ఎస్‌బీహెచ్‌- స్వీకార్‌-ఉప్‌కార్‌ వైపు అనుమతిలేదు. క్లాక్‌ టవర్, వైఎంసీఏ లేదా ప్యారడైజ్, సీటీఓ వైపు పంపిస్తారు.
►ఆర్టీఏ కార్యాలయం (తిరుమలగిరి), కార్ఖానా, మల్కాజిగిరి, సఫిల్‌గూడ నుంచి ప్లాజా వైపు వచ్చే ట్రాఫిక్‌ టివోలి వద్ద స్వీకార్‌-ఉప్‌కార్, వైఎంసీఏ లేదా బ్రూక్‌ బాండ్, బాలంరాయ్, సీటీఓ వైపు ప్రయాణించాలి. 
►జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి బేగంపేటవైపు వచ్చే వాహనాలను పంజాగుట్ట వద్ద ఖైరతాబాద్, గ్రీన్‌ల్యాండ్‌ రాజ్‌భవన్‌ వైపు పంపిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement