సొంతూరు అభివృద్ధికి 11 ఎకరాల విరాళం
నిజామాబాద్ జిల్లా: టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ పెద్ద మనసు చాటుకున్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలోని తన స్వగ్రామం రహమత్‌నగర్‌లో ఆదివారం పర్యటించి గ్రామాభివృద్ధి కోసం 11 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన ఆయన మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం 10 ఎకరాల భూమిని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే సబ్‌స్టేషన్ కోసం ఒక ఎకరం భూమిని విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. టెంపుల్ కారిడార్‌ను తన గ్రామం మీదుగా మంజూరు చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, రోడ్లు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మహేశ్‌కుమార్‌గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.


