కాంగ్రెస్ నేతల వ్యాపారం బీజేపీ ఎమ్మెల్సీ ఆరోపణ
కర్ణాటక: కాంగ్రెస్ నాయకులు సొంత పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.50 కోట్ల ఆఫర్ ఇచ్చారు అని బీజేపీ ఎమ్మెల్సీ చలవాది నారాయణస్వామి ఆరోపించారు. ఆదివారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన, ఇంతకాలం వేరే పార్టీవారిని తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు గుర్రాల వ్యాపారం చేస్తుండేవారు. నేడు కాంగ్రెస్ నాయకులు తమ పార్టీలోనే వ్యాపారం సాగిస్తున్నారని హేళన చేశారు.
తమ వైపు చేరితే ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు ఇస్తామని హామీనిచ్చారని తెలిసిందన్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలకు 50 కోట్లతో పాటుగా ఒక ఫ్లాట్, ఒక ఫార్చునర్ కారును ఆఫర్ చేశారన్నారు. ఈ విషయాన్ని తాను ఈడీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ ఇన్‌చార్జి రణదీప్ సుర్జేవాలా మంత్రి పదవిని ఇప్పించడానికి ఒక్కో ఎమ్మెల్యేకు రూ.200 కోట్లు డిమాండ్ పెట్టారని ఆరోపించారు.


