సెల్ఫీ మోజులో ముగ్గురు యువతుల మృతి | Three Girls Died In Ali Sagar In Nizamabad | Sakshi
Sakshi News home page

విషాదం: సెల్ఫీ మోజులో ముగ్గురు మృతి

Nov 15 2020 7:01 PM | Updated on Nov 15 2020 7:21 PM

Three Girls Died In Ali Sagar In Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్ : జిల్లాలోని ఎడపల్లి మండలం అలీసాగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు అలీసాగర్ రిజర్వాయర్‌లో పడి ముగ్గురు యువతులు మృతి చెందారు. సెల్ఫి దిగుతూ ఒకరి వెంట మరొకరు నీళ్ళల్లో పడిపోయి మృత్యువాత పడ్డారు. ఒకరిని కాపాడబోయి మరొకరు నీళ్ళల్లో పడిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానాకుల ద్వారా తెలుస్తోంది. మృతులు బోధన్ పట్టణం రాకాసిపేట్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. బోధన్‌లోని ఓ వార్డు కౌన్సిలర్ అన్నయ్య కూతుర్లు జుబెరా (16), మశేరా (14), మీరాజ్‌ (12)గా తెలిసింది. ఈ విషాద ఘటనతో బాధిత కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతులంతా 16 ఏళ్లలోపు వారే కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు విలపిస్తున్నారు. ఈ ఘటనలో రాకాసిపేట్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

గుంటూరు కొల్లిపర మండలం పిడపర్తి పాలెం లో విషాదం చోటుచేసుకుంది. పశువులు కడగడానికి కాలువలోకి దిగి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. యువకుల కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement