అన్నారం బ్యారేజీకి ప్రమాదమేం లేదు!  | Sakshi
Sakshi News home page

అన్నారం బ్యారేజీకి ప్రమాదమేం లేదు! 

Published Thu, Nov 2 2023 2:47 AM

There is no danger of Annaram barrage - Sakshi

కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం (సరస్వతి) బ్యారేజీలో నీటి లీకేజీ అంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని బ్యారేజీ ఈఈ యాదగిరి తెలిపారు. బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం లేదని, పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు.

భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండల పరిధిలో ఈ బ్యారేజీని నిర్మించిన విషయం తెలిసిందే. దీని నుంచి నీళ్లు లీకవుతున్నట్టుగా బుధవారం ఉదయం నుంచి సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై ఈఈ యాదగిరి వివరణ ఇచ్చారు. బ్యారేజీ వద్ద 1,275 మీటర్లతో పొడవుతో సీపేజ్‌ ఉంటుందని.. దీనికి వార్షిక నిర్వహణ (ఓఅండ్‌ఎం)లో భాగంగానే పనులు చేస్తున్నామని తెలిపారు.

ఏటా సివిల్, మెకానిక్, ఎలక్ట్రికల్‌ మెయింటెనెన్స్‌ ఉంటుందని,  సీపేజ్‌ తగ్గినప్పుడు మెటల్, ఇసుక వేస్తున్నామన్నారు. పూర్తి నిర్వహణ బాధ్యత అఫ్‌కాన్‌ సంస్థదేనని తెలిపారు. ప్రాజెక్టును ఇలాంటి సమస్యలను తట్టుకునే విధంగానే డిజైన్‌ చేశామన్నా రు. అవసరమైతే కెమికల్‌ గ్రౌటింగ్‌ కూడా చేస్తామన్నారు. కాగా బ్యారేజీ పూర్తి నిల్వ సామర్థ్యం 10.87 టీఎంసీలుకాగా, ప్రస్తుతం 5.75 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement