రీల్స్ చేసేవారికి తెలంగాణ సర్కార్‌ బంపర్ ఆఫర్.. రూ. 75 వేలు గెలుచుకునే ఛాన్స్‌

Telangana: Short Video Making Contest Drugs Its Impact on Society - Sakshi

ప్రస్తుతం సోషల్‌ మీడియా హవా నడుస్తోంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దీనికి అలవాటు పడిపోయారు. రోజులో కనీసం ఒకటి రెండు గంటలు సోషల్‌ మీడియాలోనే గడుపుతున్నారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌.. ట్విట్టర్‌.. దేన్ని వదలడం లేదు. టిక్‌టాక్‌పై నిషేధం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకొచ్చిన ‘రీల్స్‌ ఫీచర్‌’ పై జనాలు ఎక్కువ అడిక్ట్‌ అయిపోయారు. చిన్నచిన్న వీడియోలు సైతం వైరల్‌గా మారుతున్నాయి. ఇది సామాన్యులను సైతం కంటెంట్‌ సృష్టికర్తలుగా మార్చేస్తోంది. రాత్రికి రాత్రే పెద్ద స్టార్‌డమ్‌ను తీసుకొస్తుంది.

తాజాగా తెలంగాణ సర్కార్ రీల్స్‌ చేసే వారికి  తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం ఎక్కువైతుండటంతో.. తామ కాన్సెప్ట్‌కు తగ్గట్టు ఆకట్టుకునే విధంగా రీల్స్‌ చేస్తే.. భారీ మొత్తం నగదు బహుమతి గెలుచుకోవచ్చని ప్రకటించింది. యువత డ్రగ్స్‌కు బానిసలుగా మారి వారి జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 

మాదక ద్రవ్యాల వినియోగం, దాని వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం అంతర్జాతీయ డ్రగ్ అండ్ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జూన్ 26న షార్ట్ వీడియో కాంటెస్ట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ‘డ్రగ్స్ అండ్ ఇట్స్ ఎడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ’’ పేరుతో పోలీస్ శాఖ కాంటెస్ట్ నిర్వహించనుంది.  డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు, దీనికి బానిసలైన వారి కుటుంబ సభ్యుల బాధలను తమ రీల్స్‌ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించడమే ఈ పోటీ ఉద్దేశం.

18 ఏళ్లు నిండిన వారందరూ ఈ పోటీలకు అర్హులని తెలిపింది. ఈ వీడియోను 3 నిమిషాల నిడివితో రూపొందించాల్సి ఉంది. కాగా జూన్ 20లోపు వీడియోలను పంపాల్సి ఉంటుంది.ఈ పోటీలో విజేతలకు బహుమతులు కూడా అందిజచున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.  మొదటి  విజేతకు రూ. 75,000 , రెండో స్థానంలో గెలిచిన వారికి రూ. 50,000, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ. 30,000 వేల నగదు బహుమతి ఇస్తారు. ఈ పోటీలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు మరింత సమాచారం కోసం నిర్వాహకులను 96523 94751 నంబర్‌లో సంప్రదించవచ్చని పేర్కొంది.
చదవండి: వరంగల్‌లో లింగ నిర్ధారణ పరీక్షలు.. 18 మంది అరెస్ట్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top