
సాక్షి, హైదరాబాద్: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రేపటి నుంచి రైతుల అకౌంట్లలో రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమ చేయనుంది. ఈ మేరకు మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఎకరాలతో సంబంధం లేకుండా రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లలో జమకానున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం (జూన్16) 1,034 రైతు వేదికల్లో ‘రైతునేస్తం’కార్యక్రమం ప్రారంభమైంది. ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సీఎం రేవంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేదికపై తెలంగాణ రైతు భరోసా విధి విధానాల్ని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది