త్వరలో శని విరగడ అవుతుంది: కోదండరాం   | Telangana: Professor Kodandaram Comments On TRS Party | Sakshi
Sakshi News home page

త్వరలో శని విరగడ అవుతుంది: కోదండరాం  

Oct 22 2021 4:52 AM | Updated on Oct 22 2021 4:52 AM

Telangana: Professor Kodandaram Comments On TRS Party - Sakshi

పంజగుట్ట: ఎవకైనా శని పట్టుకుంటే ఏడున్నర సంవత్సరాలు ఉంటుం దని జ్యోతిష్యులు అంటుంటారని, తెలంగాణ రాష్ట్రాని కి కూడా టీఆర్‌ఎస్‌ పాలన అనే శని పట్టుకుని ఏడున్నర సంవత్సరాలు కావొస్తుందని త్వరలోనే ఈ శనికూడా విరగడవుతుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. తెలంగాణ జర్నలిస్టు యూనియన్, రాష్ట్ర చిన్న, మధ్య తరహా దినపత్రికలు, మేగజైన్స్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్టుల సమస్యలపై గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కో దండరాం మాట్లాడుతూ, అక్రిడేషన్‌ కార్డులు ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వం వివక్ష చూ పుతోందని, గుర్తింపు కార్డులు ఇస్తే ప్రభుత్వ ఆస్తులు తగ్గుతాయా, బడ్జెట్‌ నుంచి ఏమైనా డబ్బులు ఖర్చు అవుతున్నాయా అని ప్రశ్నించారు. సమావేశంలో సీనియర్‌ పాత్రికేయులు పాశం యాదగిరి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement