Telangana: కొత్తగా 155 కరోనా కేసులు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగు తున్నాయి. శుక్రవారం 16,319 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఏకంగా 155 మంది వైరస్ బారిన పడ్డారు. అత్యధికంగా హైదరాబాద్‌లో 81 మందికి వైరస్ సోకింది. 13 జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి.
దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7.94 లక్షలకు చేరింది. ఒక రోజులో 59 మంది కోలుకోగా, మొత్తం ఇప్పటివరకు 7.89 లక్షల మంది కోలు కున్నారు. ప్రస్తుతం 907 క్రియాశీలక కేసులు నమోదయ్యాయి. అందులో ఇద్దరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.