పీఆర్‌టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనార్దన్‌రెడ్డి | Telangana: Janardhan Reddy As PRTU MLC Candidate | Sakshi
Sakshi News home page

పీఆర్‌టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనార్దన్‌రెడ్డి

Dec 3 2022 2:52 AM | Updated on Dec 3 2022 3:58 PM

Telangana: Janardhan Reddy As PRTU MLC Candidate - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ టీచర్స్‌ నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డిని నిలబెడుతున్నట్టు పీఆర్‌టీయూ తెలంగాణ ప్రకటించింది. శుక్రవారం జరిగిన సంఘం సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఎం.అంజిరెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. జనార్దన్‌రెడ్డి విజయం కోసం సంఘంలోని ప్రతీ కార్యకర్త కృషి చేయాలని ఆయన కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, 317 జీవో వల్ల ఏర్పడ్డ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని తెలిపారు. సమావేశంలో సంఘం గౌరవాధ్యక్షుడు పర్వత సత్యనారాయణ, సంఘం అధ్యక్షుడు చెన్నయ్య, ఆర్థిక కార్యదర్శి ఎన్‌. చంద్రశేఖర్‌ రావు, వ్యవస్థాపక అధ్యక్షుడు ముకుందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, పీఆర్‌టీయూ తెలంగాణ నేతలు చెన్నయ్య, అంజిరెడ్డి తదితరులు శుక్రవారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణను కలిశారు. ‘తొలిమెట్టు’కోసం నియమించిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీని రద్దు చేయాలని, ఎన్‌జీవోల భాగస్వామ్యం సరికాదని తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement