Vishnu Priya: విష్ణు ప్రియకు ముందస్తు బెయిల్‌ ఇవ్వడం కుదరదు | Telangana High Court Denies Anticipatory Bail for Vishnu Priya | Sakshi
Sakshi News home page

Vishnu Priya: విష్ణు ప్రియకు ముందస్తు బెయిల్‌ ఇవ్వడం కుదరదు

Mar 28 2025 6:56 PM | Updated on Mar 28 2025 7:46 PM

Telangana High Court Denies Anticipatory Bail for Vishnu Priya

సాక్షి,హైదరాబాద్‌:  తెలుగు రాష్ట్రాల్ని కుదిపేస్తున్నే బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారంలో నటి విష్ణు ప్రియాకు  (Vishnupriya) భారీ షాక్‌ తగిలింది. బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఆమెకు ముందస్తు బెయిల్‌ ఇవ్వడం కుదరదని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది.

బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ విష్ణు ప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సమయంలో ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు విష్ణు ప్రియకు ముందుస్తు బెయిల్‌ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. విచారణ అధికారి ఎదుట హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. 

ప్రముఖులపై కేసులు
బెట్టింగ్ యాప్ వివాదంలో తెలంగాణ పోలీసులు బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేస్తున్న ప్రముఖులపై కేసులు న‌మోదు చేశారు. విచారిస్తున్నారు. వారిలో విష్ణు ప్రియా సైతం ఉన్నారు. అయితే ఈ వివాదంలో నటి విష్ణుప్రియ మార్చి 20 పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.

ఈ తరుణంలో విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టులో పిటిషన్  దాఖలు చేశారు. ముందుస్తు బెయిల్‌ కావాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు అంగీకరించలేదు. ఈ రోజు ఆమె పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయడానికి మరియు దర్యాప్తును నిలిపివేయడానికి హైకోర్టు తిరస్కరించింది. అదే సమయంలో ఈ కేసులో పోలీసులతో సహకరించాలని విష్ణుప్రియకు హైకోర్టు సూచించింది. చట్టబద్ధంగా దర్యాప్తు కొనసాగించాలని పోలీసులకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 

బెట్టింగ్ బెండు తీస్తున్న పోలీసులు

Advertisement
 
Advertisement
Advertisement