అర్హుల నమోదుకు‘కోవిడ్‌’ యాప్‌! | Telangana govt launches T-Covid-19 app | Sakshi
Sakshi News home page

అర్హుల నమోదుకు‘కోవిడ్‌’ యాప్‌!

Dec 10 2020 4:17 AM | Updated on Dec 10 2020 11:15 AM

Telangana govt launches T-Covid-19 app - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కరోనా వ్యాక్సిన్‌ కు అర్హులైన వారు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాక్సిన్‌ కు అర్హులైన వారు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి తెలంగాణ ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది వారం, పది రోజుల్లో అందుబాటులోకి రానుంది. దీన్ని కోవిడ్‌ యాప్‌గా తీర్చిదిద్దుతున్నారు. వచ్చే నెల రెండో వారం నుం చి రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ వేసేం దుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అప్పటివరకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని కేంద్రం తేల్చిచెప్పడంతో వైద్య, ఆరోగ్యశాఖ యుద్ధ ప్రా తిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు గత రెండ్రోజులుగా ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు యాప్‌నకు సం బంధించి సన్నాహాలపై చర్చించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మొ దటి విడత దాదా పు 70 లక్షల నుంచి 75 లక్షల మందికి టీకాలు వేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు మొత్తం కలిపి 3 లక్షల మంది వివరాలను ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ సేకరించి వివరాలను కేంద్రానికి పంపిన సంగతి తెలిసిందే. ఇక మున్సిపల్‌ సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు, ఇతర ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. వీరే కాకుండా 50 ఏళ్లు పైబడిన వారు, ఇతర అనారోగ్య సమస్యలున్న వారెవరైనా కరోనా వ్యాక్సిన్‌ పొందడానికి అర్హులే అయినందున ప్రభుత్వం రూపొందించే ప్రత్యేక యాప్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. నమోదు చేసుకున్నాక అర్హుల జాబితాను అధికారులు తయారు చేస్తారు. దాని ప్రకారం వ్యాక్సిన్‌ను అందజేస్తామని చెబుతున్నారు. రాష్ట్రంలో మొదటి విడతలో దాదాపు 75 లక్షల మందికి మొదటి విడత టీకాలు ఇచ్చే అవకాశమున్నందున ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో 3 కోట్ల టీకాలను నిల్వ చేసే సామర్థ్యమున్నట్లు అధికారులు చెబుతున్నారు.  

వ్యాక్సిన్‌పై వర్క్‌షాప్‌..
వ్యాక్సిన్‌పై వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. బుధవారం వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా శిక్షణ ప్రారంభమైంది. అది గురువారం కూడా కొనసాగనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement