వైద్యుల కర్మాగారంగా తెలంగాణ: హరీశ్‌రావు  | Sakshi
Sakshi News home page

వైద్యుల కర్మాగారంగా తెలంగాణ: హరీశ్‌రావు 

Published Sat, Aug 5 2023 6:37 AM

Telangana as a factory of doctors: Harish Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైద్యుల కర్మాగారంగా తెలంగాణ మారిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అసెంబ్లీలో శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖపై జరిగిన స్వల్పకాలిక చర్చకు ఆయన సమాధానమిచ్చారు. ‘తెలంగాణ వైట్‌ కోట్‌ రివల్యూషన్‌ సాధించింది. ఆ మేరకు మెడికల్‌ కాలేజీలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది దేశంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన సీట్లలో 43% తెలంగాణ నుంచే ఉన్నాయి. త్వరలోనే మండలస్థాయిలో త్వరలోనే 40 ప్రాథమిక ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏడాది వరంగల్‌ హెల్త్‌ సిటీని ప్రారంభిస్తాం’ అని మంత్రి హరీశ్‌రావు వివరించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement