మాజీ ప్రధాని రాజీవ్‌కి టీ పీసీసీ ఘన నివాళి | Telangana Congress Leaders Pay Tributes To Rajiv Gandhi | Sakshi
Sakshi News home page

మాజీ ప్రధాని రాజీవ్‌కి టీ పీసీసీ ఘన నివాళి

Aug 20 2020 10:47 AM | Updated on Aug 20 2020 11:06 AM

Telangana Congress Leaders Pay Tributes To Rajiv Gandhi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 76వ జయంతి సందర్బంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు.. ఉదయం సోమజిగూడా లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూల మాలలు వేశారు. అలాగే గాంధీభవన్ లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్యెల్యే జగ్గారెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్,  మల్లు రవి, దాసోజు శ్రవణ్, ఉజ్మా షకీర్, టి.కుమార్ రావ్, బొల్లు కిషన్, ప్రేమ్ లాల్, ఫిరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement