నేడు కామారెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్‌  | Sakshi
Sakshi News home page

నేడు కామారెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ 

Published Wed, Mar 1 2023 1:40 AM

Telangana CM KCR to Visit Kamareddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/కామారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కుర్‌ మండలం తిమ్మాపూర్‌లోని తెలంగాణ తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు ఆయన హాజరుకానున్నారు.  ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 10.40 గంటలకు బాన్సువాడకు చేరుకుంటారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిమ్మాపూర్‌కు చేరుకొని తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత వెంకటే శ్వర స్వామి కల్యాణోత్సవంలో పాల్గొంటారు. అనంతరం మధ్యా హ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారని అధికార వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ధర్మకర్తగా ఉన్న తెలంగాణ తిరుమల ఆలయాన్ని 2016 ఏప్రిల్‌ 2న సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు.  

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement