కరోనా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే: బండి సంజయ్‌

Telangana: All Corona Deaths Its Govt Murder Says Bandi Sanjay - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని కరోనా మరణాలు ప్రభుత్వ హత్యలేనని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. కరోనా మరణాలపై తెలంగాణ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతోందని ఆరోపించారు. కరోనాపై సీఎం కేసీఆర్ ఇప్పటివరకు సమీక్ష జరకపోవటం దారుణమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు వ్యాక్సినేషన్ ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బండి సంజయ్‌ మాట్లాడారు. 

వాక్సిన్ తీసుకోని వారు ప్రజలకు ఎలా నమ్మకాన్ని కల్పిస్తారు? అని సందేహం వ్యక్తం చేశారు. కరోనా చికిత్సను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. కష్టకాలంలో ప్రజలకు భరోసా ఇవ్వని ముఖ్యమంత్రి ఉంటే ఏంటి? లేకుంటే ఏంటి? అని పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ కరోనాను చులకనగా మాట్లాడటం వలనే ప్రజలు లైట్ తీసుకున్నారని తెలిపారు. కేంద్రంపై మాట్లాడే మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. రాజకీయ లబ్థిలో భాగంగానే ఆయూష్మాన్ భారత్‌ను తెలంగాణలో అమలు చేయడం లేదని ఆరోపించారు. కోవిడ్‌ను నియంత్రించడం చేతకాక నెపాన్ని కేంద్రంపై నెట్టేస్తున్నారని తెలిపారు. ప్రధాని మోదీ కోవిడ్ నియంత్రణకు నిరంతరం సమీక్షలు చేస్తున్నారని చెప్పారు. సరిపడా ఆక్సిజన్, వెంటిలేటర్స్‌ను రాష్ట్రానికి కేంద్రం పంపిస్తోందని వెల్లడించారు. కరోనా విజృంభణకు ఎన్నికలు ప్రధాన కారణమని పేర్కొన్నారు.

చదవండి: ఆక్సిజన్‌ సిలిండర్‌ కోసం 24 గంటల్లో 1,500 కి.మీ జర్నీ
చదవండి: అమానవీయం: సైకిల్‌పై భార్య మృతదేహం తరలింపు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top