ఆక్సిజన్‌ సిలిండర్‌ కోసం 24 గంటల్లో 1,300 కి.మీ జర్నీ

For Oxygen Cylinder A Man Travels 1,300 Km In 24 Hours - Sakshi

రాంచీ: కరోనా బారినపడిన స్నేహితుడిని కాపాడుకునేందుకు అతడి మిత్రుడు సాహస యాత్ర చేశాడు. 24 గంటల్లో ఏకంగా 1,300 కిలోమీటర్లు నిరంతరం ప్రయాణం చేసి మరీ తన స్నేహితుడికి ఆక్సిజన్‌ సిలిండర్‌ తీసుకొచ్చాడు ఓ ఫ్రెండ్‌. అతడి చేసిన సాహస యాత్రపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఆయనే రాంచీకి చెందిన దేవేంద్ర కుమార్‌ శర్మ. జార్ఖండ్‌లోని రాంచీ నుంచి ఘజియాబాద్‌లోని వైశాలి వరకు ప్రయాణించిన మిత్రుడి కథ చదవండి..

జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన దేవేంద్ర కుమార్‌ శర్మకు ఏప్రిల్‌ 24వ తేదీన స్నేహితుడు సంజయ్‌ సక్సేనా ఫోన్‌ చేశాడు. తనకు కరోనా సోకిందని ఆక్సిజన్‌ కావాలని కోరాడు. వెంటనే స్పందించిన సంజయ్‌ తన మిత్రుడు రాజన్‌ను సంప్రదించాడు. 24 గంటల్లో ఆక్సిజన్‌ కావాలని కోరడంతో తన మిత్రుల ద్వారా ఆక్సిజన్‌ కోసం వెతికాడు. చివరకు 120 కిలోమీటర్ల దూరంలోని బోకారోలో ఆక్సిజన్‌ అందుబాటులో ఉందని తెలియడంతో అర్ధరాత్రి సంజయ్‌ బైక్‌పై అక్కడకు వెళ్లాడు. రాకేశ్‌ కుమార్‌ గుప్తాకు చెందిన జార్ఖండ్‌ గ్యాస్‌ ప్లాంట్‌లో గ్యాస్‌ తీసుకుని అనంతరం వెంటనే ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ చేరుకున్నాడు. స్నేహితుడు ఉన్న వైశాలి ప్రాంతానికి చేరుకుని ఆక్సిజన్‌ సిలిండర్‌ సకాలంలో అందించాడు. ఈ విధంగా మొత్తం 1,300 కిలోమీటర్లు 24 గంటలు నిరంతరం ప్రయాణం చేసి తన స్నేహితుడి కోసం ఆక్సిజన్‌ తీసుకొచ్చాడు.

చదవండి: కరోనాతో ఒకేరోజు ముగ్గురు ప్రముఖులు కన్నుమూత
చదవండి: నాలుగంటే నాలుగే రోజుల లాక్‌డౌన్‌: ఎక్కడంటే..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top