‘కండల ఇంజెక్షన్ల’ పట్టివేత! | Emergency Medical Injections Sold As Steroids, Task Force Arrests Man In Hyderabad | Sakshi
Sakshi News home page

‘కండల ఇంజెక్షన్ల’ పట్టివేత!

Jan 27 2026 9:15 AM | Updated on Jan 27 2026 10:01 AM

Task Force Police Nab-man Selling Injections as Steroids

మందుల చీటీ లేకుండా ‘మెఫెంటరై్మన్‌ సల్ఫేట్‌’విక్రయం

సాక్షి, హైదరాబాద్‌: అత్యవసర వైద్య సమయాల్లో వినియోగించే ఇంజెక్షన్లను స్టెరాయిడ్స్‌గా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పశ్చిమ మండల టాస్‌్కఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు టాస్‌్కఫోర్స్‌ అదనపు డీసీపీ మహ్మద్‌ ఇక్బాల్‌ సిద్ధిఖీ సోమవారం వివరాలు వెల్లడించారు. కిషన్‌బాగ్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఫైజల్‌ ఖాన్‌ ఫర్మిచర్‌ దుకాణంలో పనిచేస్తుంటాడు. జిమ్‌కు వెళ్లే అలవాటు ఉన్న ఫైజల్‌ అక్కడ కొందరు యువకులు మెఫెంటరై్మన్‌ సల్ఫేట్‌ ఇంజెక్షన్లను స్టెరాయిడ్స్‌గా వాడుతున్నట్లు తెలుసుకున్నాడు. 

ఇదే అదనుగా తేలిగ్గా డబ్బు సంపాదించడానికి వీటిని అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ఇండియా మార్ట్‌ యాప్‌ ద్వారా సూరత్‌ నుంచి ఈ ఇంజెక్షన్లు ఒక్కోటి రూ.150కి ఖరీదు చేసి జిమ్‌కు వచ్చే యువతకు రూ.600 నుంచి రూ.700కు విక్రయిస్తున్నాడు. యువత నిరీ్ణత బరువు కంటే ఎక్కువ బరువులు ఎత్తడానికి, కండలు పెంచుకోవడానికి, ఎక్కువ సమయం వ్యాయామం చేయడానికి స్టెరాయిడ్‌గా ఈ ఇంజెక్షన్‌ వాడుతున్నారు. 

ఆరోగ్యపరంగా అనేక దుష్పరిణామాలు.. 
ఫైజల్‌ వ్యవహారంపై సమాచారం అందుకున్న టాస్‌్కఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ యదేందర్, ఎస్సై మహ్మద్‌ జాహెద్‌ తమ బృందాలతో వలపన్ని అత్తాపూర్‌లోని ఏసియన్‌ థియేటర్‌ వద్ద పట్టుకున్నారు. అతడి వద్దనున్న 133 ఇంజెక్షన్లు స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ ఇంజెక్షన్లను కొన్నాళ్లు ఫైజల్‌ కూడా వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. నిబంధనల ప్రకారం వీటిని కేవలం మెడికల్‌ షాపుల్లో, వైద్యుడి చీటీ ఆధారంగానే విక్రయించాలి. వీటిని సుదీర్ఘకాలం వాడితే రక్తపోటు, గుండె సమస్యలతోపాటు మానసిక ఇబ్బందులు వస్తాయని అదనపు డీసీపీ హెచ్చరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement