ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: సిట్‌ విచారణ వేగవంతం | SIT Investigation On TRS MLAs Purchasing Case | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: సిట్‌ విచారణ వేగవంతం

Nov 21 2022 4:36 PM | Updated on Nov 21 2022 7:34 PM

SIT Investigation On TRS MLAs Purchasing Case - Sakshi

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు సంబంధించి సిట్‌ విచారణ కొనసాగుతోంది. బండి సంజయ్‌ అనుచరుడు అడ్వకేట్‌ శ్రీనివాస్‌ను పోమవారం సిట్‌ సుదీర్ఘంగా విచారించింది. సుమారు 8 గంటల పాటు శ్రీనివాస్‌ను సిట్‌ విచారించింది. సింహయాజి స్వామికి శ్రీనివాస్‌ విమానం టికెట్‌ కొనుగోలు చేసినట్లు గుర్తించిన సిట్‌..ఈ మేరకు విచారణ చేపట్టింది. అక్టోబర్‌ 26వ తేదీన తిరుపతి నుండి హైదరాబాద్‌కు సింహయజుల స్వామికి శ్రీనివాస్‌ ఫ్లైట్‌ టికెట్‌ చేసినట్లు సిట్‌ గుర్తించింది.

సింహయాజి స్వామితో శ్రీవివాస్‌కు ఉన్న పరిచాయలపై ప్రధానంగా సిట్‌ విచారించింది. ఫోన్‌ కాల్‌ లిస్ట్‌, యూపీఐ ట్రాన్సక్షన్స్‌  ఆధారంగా సిట్‌ విచారించింది. అయితే పూజకు సంబంధించే సింహయాజి స్వామికి ఫ్లైట్‌ టికెట్‌ బుక్‌ చేసినట్లు విచారణలో శ్రీనివాస్‌ వెల్లడించారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లోని 17వ అంతస్తులో ఉన్న సిట్‌ కార్యాలయంలో రాజేంద్రనగర్‌ ఏసీపీ గంగాధర్‌ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. కాగా, ఈ విచారణకు బీఎల్‌ సంతోష్‌, జగ్గు స్వామి, తుషార్‌లు హాజరు కాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement