సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌లో సిద్దిపేట టాప్‌

Siddipet tops in citizen feed back - Sakshi

స్వచ్ఛ సర్వేక్షణ్‌–2023లో పాల్గొంటున్న 4,355 పట్టణాలు

9,500 మార్కులకుగాను ఫీడ్‌ బ్యాక్‌కు 600 మార్కులు

స్వచ్ఛతపై ముగిసిన ఫీడ్‌ బ్యాక్‌ స్వీకరణ

సాక్షి, సిద్దిపేట: స్వచ్ఛ సర్వేక్షణ్‌–2023లో భాగంగా పట్టణంలో చెత్త సేకరణ, పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా, పబ్లిక్‌ టాయిలెట్‌లు ఉన్నాయా? అని ఇలా పది రకాల ప్రశ్నలతో స్వచ్ఛత యాప్‌ ద్వారా సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నారు. లక్షకు పైగా జనాభా కలిగిన పట్టణాల ఫీడ్‌ బ్యాక్‌లో సిద్దిపేట మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ 2.0 సంయుక్త ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌–2023 పేరుతో పోటీలు నిర్వహిస్తోంది.

దేశంలోని 4,355 పట్టణా లు ఇందులో మెరుగైన ర్యాంకింగ్‌ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. గతేడాది స్వ చ్ఛ సర్వేక్షణ్‌–2022లో తెలంగాణలోని మున్సిపాలి టీలు, కార్పొరేషన్‌లు 16 అవార్డులు సాధించాయి.

ఫీడ్‌ బ్యాక్‌లో టాప్‌లో సిద్దిపేట: సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌ స్వీకరణ ఆగస్టు 31వ తేదీతో ముగిసింది. దేశ వ్యాప్తంగా 4,355 పట్టణాలుండగా లక్షకు పైగా జనా భా ఉన్నవి 427, లక్షలోపు 3,928 పట్టణాలున్నాయి. లక్షకు పైగా జనాభా కలిగిన 427 పట్టణాల ఫీడ్‌ బ్యా క్‌లో తొలి స్థానంలో సిద్దిపేట నిలిచింది. సిద్దిపేట మున్పిపాలిటీలో 1,16,583 జనాభా ఉండగా 76, 283 మంది.. అంటే ఉన్న జనాభాలో 65.43 శాతం మంది ఫీడ్‌ బ్యాక్‌ ఇచ్చారు.  32.61 శాతం మంది ఫీడ్‌ బ్యాక్‌తో 4వ స్థానంలో మహబూబ్‌నగర్, 8.88 శాతంతో 24వ స్థానంలో వరంగల్‌ ఉంది.

ఫీడ్‌ బ్యాక్‌కు 600 మార్కులు: స్వచ్ఛ సర్వేక్షణ్‌ లో మొత్తం 9,500 మార్కులు కేటాయించనున్నా రు. అందులో సర్వీస్‌ లెవల్‌ ప్రోగ్రెస్‌కు 4,830, సర్టిఫికేషన్‌కు 2,500, సిటిజన్‌ వాయిస్‌కు 2,170 కేటాయించగా, సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌కు 600 మార్కులను కేటాయించనున్నారు. జిల్లాలోని ము న్సిపాలిటీలు ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్‌–2023కు ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేశారు. వాటి ప్రకారం పట్టణం ఉందా? లేదా? అని ఫిజికల్‌గా వెరిఫికేషన్‌ చేయనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top