Senior Leader D Srinivas Rao Hospitalized Due To Illness - Sakshi
Sakshi News home page

సీనియర్‌ నేత డీ.శ్రీనివాస్‌కు అస్వస్థత.. ఎంపీ అరవింద్‌ ఏమన్నారంటే?

Feb 27 2023 12:07 PM | Updated on Feb 27 2023 1:03 PM

Senior Leader D Srinivas Admitted In Hospital Due To Illness - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సీనియర్‌ నేత, మాజీ పీసీసీ చీఫ్‌ డీ. శ్రీనివాస్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, కుటుంబ సభ్యులు.. శ్రీనివాస్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

అయితే, సోమవారం ఉదయం శ్రీనివాస్‌కు ఫిట్స్‌ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో వైద్యులు శ్రీనివాస్‌కు చికిత్స అందిస్తున్నారు. కాగా, వైద్య పరీక్షల అనంతరం డీఎస్‌ ఆరోగ్యపరిస్థితిని వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు. 

ఇదిలా ఉండగా.. తన తండ్రి శ్రీనివాస్‌కు అనారోగ్యం నేపథ్యంలో బీజేపీ ఎంపీ అరవింద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేనని కార్యకర్తలకు మెసేజ్‌లో తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement