ఎస్‌బీఐ చీఫ్‌ మేనేజర్‌ అరెస్ట్‌  | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ చీఫ్‌ మేనేజర్‌ అరెస్ట్‌ 

Published Sun, Feb 18 2024 7:50 AM

SBI Chief Manager arrested - Sakshi

హిమాయత్‌నగర్‌: సస్పెన్షన్‌లో ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ మేనేజర్‌ తిగుళ్ల ప్రవీణ్‌ను నగర సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.  గన్‌ ఫౌండ్రీలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కో ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీకి చెందిన బై–లాస్‌ను ఉల్లంఘించి, నిబంధనలకు విరుద్ధంగా సొసైటీలో సభ్యులు కాని వారికి రూ.1.42 కోట్ల మేర రుణాలు మంజూరు చేశారు. దీంతో కోట్ల రూపాయలు రుణాలు సొసైటీ అనుమతి లేకుండా ఇవ్వడంపై ఉన్నతాధికారులు గతంలో సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు తిగుళ్ల ప్రవీణ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నగర సహాయ కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement