రేపు సద్దుల బతుకమ్మ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు | Saddul;a Batukamma Celebration Traffic Restrictions In Hyderabad | Sakshi
Sakshi News home page

రేపు సద్దుల బతుకమ్మ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Sep 29 2025 5:32 PM | Updated on Sep 29 2025 7:22 PM

Saddul;a Batukamma Celebration Traffic Restrictions In Hyderabad

హైదరాబాద్‌:  నగరంలో దసరా ఉత్సవాల్లో భాగంగా రేపు(మంగళవారం, సెప్టెంబర్‌ 30వ తేదీ) సద్దుల బతుకమ్మ వేడుకను పురస్కరించుకుని ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ప్రధానంగా అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌, నెక్లెన్‌రోడ్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను విధిస్తూ తెలంగాణ పోలీస్‌ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అమరవీరుల స్మారక స్థూపం నుండి బతుకమ్మ ఘాట్" (రోటరీ చిల్డ్రన్స్ పార్క్) వరకు అప్పర్ ట్యాంక్ బండ్ వద్ద జరగనున్న ఈ ఉత్సవాల కారణంగా రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకూ ఈ ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. దీనిలో భాగంగా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసింది.

రేపటి ట్రాఫిక్‌ ఆంక్షలు- దారి మళ్లింప మార్గాలు ఇవే..

  • తెలుగు తల్లి జంక్షన్, కర్బలా మైదాన్ నుండి ట్యాంక్ బండ్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను  రేపు మధ్యాహ్నం 2.00 గంటల నుండి  రాత్రి 11 గంటల వరకు అనుమతించరు.

  • ఇక్బాల్ మినార్ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను తెలుగు తల్లీ  ఫ్లైఓవర్ ఫ్లైఓవర్  ప్రారంభం నుంచే  కట్ట మైసమ్మ, డా. బీఆర్‌ అంబేద్కర్‌, ఇందిరా పార్క్, గాంధీనగర్, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ మీదుగా మళ్లిస్తారు.

  •  V.V. విగ్రహం నుండి ఎన్టీఆర్‌ మార్గ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఇందిరా గాంధీ విగ్రహం (నెక్లెస్ రోటరీ) వద్ద ప్రసాద్స్ హైమాక్స్‌,  మింట్ కాంపౌండ్ లేన్ వైపు మళ్లిస్తారు.

  • నల్లకుంట జంక్షన్ నుండి బుద్ధ భవన్ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు.  అటు నుంచి వచ్చే వారిని నల్లకుంట X-క్రాస్ రోడ్‌,  రాణిగంజ్ మీదుగా నెక్లెస్ రోడ్ వైపు మళ్లిస్తారు.
     

  • లిబర్టీ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను అంబేద్కర్ విగ్రహం వద్ద ఇక్బాల్ మినార్ 'యు'  టర్న్‌ నుంచి తెలుగు తల్లీ జంక్షన్ నుంచి తెలుగు తల్లీ ఫ్లైఓవర్ వైపు మళ్లించబడుతుంది.

  • సికింద్రాబాద్ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను కర్బలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్-జబ్బార్ కాంప్లెక్స్- కవాడిగూడ - గాంధీ నగర్ టి జంక్షన్- గోశాల- ధోభి ఘాట్- స్విమ్మింగ్ పూల్- బండ మైసమ్మ- ఇందిరా పార్క్- కట్ట మైసమ్మ,  తెలుగు తల్లీ ఫ్లైఓవర్ వైపు మళ్లించబడుతుంది. 
     

  • ముషీరాబాద్, కవాడిగూడ నుండి చిల్డ్రన్స్ పార్క్ - అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ అనుమతించబడదు.  డా బీఆర్‌ అంబేదక్ర్‌ మిల్స్ నుంచి MRO ఆఫీస్, ధోభి ఘాట్స్వి, మ్మింగ్ పూల్, బండమైసమ్మ-,ఇందిరా పార్క్క, కట్టమైసమ్మ వైపు మళ్లించబడుతుంది.

ఆర్టీసీ బస్సుల మళ్లింపు
సికింద్రాబాద్ నుండి ఎంజీబీఎస్‌ వైపు  వచ్చే అన్ని అంతర్ జిల్లా ఆర్టీసీ బస్సులను స్వీకార్-ఉపాకర్ జంక్షన్ వద్ద YWCA-సంగీత్, మెట్టుగూడ, తార్నాక, నల్లకుంట-ఫీవర్ హాస్పిటల్ క్రాస్ రోడ్, -బర్కత్‌పురా, టూరిస్ట్ హోటల్, నింబోలి అడ్డా, చాదర్‌ఘాట్-రంగమహల్ మీదుగా ఎంజీబీఎస్‌ వైపు మళ్లించబడతాయి.

  • ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండటంతో జంక్షన్‌ల వైపు ప్రజలు రాకుండా ఉండవలసిందిగా పోలీసులు విజ్ఞప్తి చేశారు.  V.V. విగ్రహం, ఖైరతాబాద్, పాత పిఎస్ సైఫాబాద్,  ఇక్బాల్ మినార్, తెలుగు తల్లి జంక్షన్ ,నెక్లెస్ రోటరీ, లిబర్టీ,  రవీంద్ర భారతి, అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్ బండ్, కవాడిగూడ క్రాస్ రోడ్,, కట్టమైసమ్మ, కర్బలా మైదాన్, రాణిగంజ్, నల్లకుంట్ల జంక్షన్‌ల మీదుగా సాధ్యమైనంత మేర రాకండా ఉండటం మంచిదని పోలీస్‌ శాఖ కోరుతోంది. దీనిలో భాగంగా సాధారణంగా రోజూ ఈ మార్గాల్లో వచ్చేవారు ప్రత్యామ్నాయ మార్గాల మీదుగా వారి వారి ప్రాంతాలు వెళ్లేలా ఏర్పాట్లు చేసుకుని తమకు సహకరించాలని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగం విజ్ఞప్తి చేసింది. 

    పార్కింగ్‌ ఏర్పాటు ప్రాంతాలు ఇవే..

  • స్నో వరల్డ్‌

  • ఎన్టీఆర్‌ భవన్‌

  • రేస్‌ రోర్స్‌ రోడ్‌

  • బీఆర్‌కే భవన్‌ రోడ్‌

  • హెఎమ్‌డీఏ పార్కింగ్‌

  • సంజీవయ్య పార్కింగ్‌ ప్లేస్‌

  • లుంబినీ పార్క్ ఎదురుగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement