జూబ్లీ బస్టాండ్‌ దగ్గర ఆర్టీసీ బస్సు బీభత్సం | Rtc Bus Plows Into Motorist Near Jubilee Bus Stand | Sakshi
Sakshi News home page

జూబ్లీ బస్టాండ్‌ దగ్గర ఆర్టీసీ బస్సు బీభత్సం

Jun 3 2026 3:27 PM | Updated on Jun 3 2026 6:06 PM

Rtc Bus Plows Into Motorist Near Jubilee Bus Stand

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ జూబ్లీ బస్టాప్ వద్ద బుధవారం మ‌ధ్యాహ్నం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్టాండ్‌ సిగ్నల్స్‌ వద్ద అదుపుతప్పి ప్రయాణికులపైకి ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సు దూసుకెళ్లింది. దీంతో వాహనదారుడు బస్సు టైర్ల కింద ఇరుక్కుపోయాడు. ట్రాఫిక్ పోలీసులు అక్క‌డున్న వారి సాయంతో బస్సును పైకి లేపి వాహనదారుడి ప్రాణాలను కాపాడారు. బాధితుడిని స‌మీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి ప్రాణాపాయం త‌ప్ప‌డంతో పోలీసుల‌తో పాటు ప్ర‌యాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement