రాత్రయితే రోడ్డెక్కి.. వాహనదారులకు అసభ్య సైగలు! | Road Side Prostitution Centers In Hyderabad | Sakshi
Sakshi News home page

రెడ్‌ లైట్‌ ఏరియాగా.. ఉప్పల్‌ టు ఎల్బీ నగర్‌!

Dec 9 2024 11:48 AM | Updated on Dec 9 2024 12:26 PM

Road Side Prostitution Centers In Hyderabad

నాగోలు: ఎల్‌బీనగర్‌ పలు ప్రాంతాలు అంసాఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. పోలీస్‌ గస్తీ లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఎల్‌బీనగర్‌ పరిధిలోని ఆర్టీసీ కాలనీ, శివగంగాకాలనీ, కామినేని హాస్పిటల్‌ ప్రధాన రహదారి, ఎల్‌బీనగర్‌ శారద వైన్స్, ఎస్‌బీఐ కాలనీ ప్రాంతంలో నిత్యం ఇదే తంతూ కొనసాగుతుందని అటుగా రాకపోకలు సాగించే వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

రాత్రి, రోడ్డుపై నిలబడి రాకపోకలు సాగించే∙వాహనదారులను అసభ్యకర సైగలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు పెట్రోలింగ్‌ చేయకపోవడంతో వారు ఆడిందే ఆటగా మరింది. అర్ధరాత్రి అయితే చాలు వనస్ధలిపురం, గుర్రంగూడా, ఆటోనగర్, దిల్‌సుఖ్‌నగర్‌ పరిసర నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రధాన రహదారుల పక్కన కొందరు మహిళలు, యువతుల అసభ్యకర దుస్తుల్లో నిలబడుతున్నారు. రాత్రి సమయాల్లో అటు వైపు వెళ్తే రెడ్‌ లైట్‌ ఏరియాలుగా తలపిస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

నిఘా పెంచితేనే అడ్డుకట్ట.. 
ఎల్‌బీనగర్‌ కామినేని హాస్పిటల్‌ సమీపంలో ఉన్న అనేక లాడ్జిల్లో వ్యభిచార కేంద్రాలకు అడ్డాగా మారాయి. అక్కడ పోలీసులు ఎలాంటి దాడులు చేయకపోవవడంతో హోటళ్లు, లాడ్జిలలో ఇవే కొనసాగుతున్నాయి. వాటిపై పోలీసులు నిఘా ఏర్పాటు చేయాలని స్థానిక కాలనీవాసులు కోరుతున్నారు. ఆర్టీసీ కాలనీలో అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన హోటళ్లు, లాడ్జిలలో ఎవరెవరో వస్తుండటంతో ఇబ్బందిగా మారుతుందని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

కాలనీలో ఉండే మహిళలు అక్కడ రోడ్డు మీద నుంచి నడిసే పరిస్ధితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం రాచకొండ పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని కాలనీ సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు. ఇప్పటికైనా పోలీస్‌ ఉన్నతాధికారులు స్పందించి ఎల్‌బీనగర్‌ కామినేని హాస్పిటల్, ఆర్టీసీ కాలనీ, శివగంగ కాలనీ, శరదవైన్స్, సరూర్‌నగర్‌ పాత రోడ్డు ప్రాంతంలో ఉదయం, సాయంత్రం సమయాల్లో నిఘా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రోడ్డుపై నిలబడి అసభ్యకంగా ప్రవర్తిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి హోటళ్లు, లాడ్జిలలో నిఘా పెంచాలని కోరుతున్నారు.  

చర్యలు తీసకుంటాం..  
రోడ్లపై నిలబడి అసభ్యంగా సైగలు చేస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. గతంలో అనేక మంది అదుపులోకి తీసుకుని తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేశాం. తమ సిబ్బందితో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచుతాం.  
–ప్రవీణ్‌కుమార్, ఎల్‌బీనగర్‌ డీసీసీ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement