Hyderabad: ఓఆర్‌ఆర్‌.. వరుసగా ఢీకొన్న ఏడు కార్లు | road accident in rajendra nagar outer ring road | Sakshi
Sakshi News home page

Hyderabad: ఓఆర్‌ఆర్‌.. వరుసగా ఢీకొన్న ఏడు కార్లు

Oct 5 2025 2:57 PM | Updated on Oct 5 2025 3:17 PM

road accident in rajendra nagar outer ring road

సాక్షి,హైదరాబాద్‌: రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డులో  రోడ్డు ప్రమాదం జరిగింది. ఏడు కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్లు దెబ్బతిన్నాయి. అందులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. కార్లలోని ప్రయాణికులతో పాటు ఇతర వాహనదారులు  గాయపడ్డారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాదం ఆదివారం(అక్టోబర్‌  రాజేంద్రనగర్ నుంచి అప్పా జంక్షన్ వైపు వస్తుండగా జరిగింది.

ఓ కారు డ్రైవర్ మితిమీరిన వేగంతో వెళ్లి ఒక్కసారి బ్రేక్ వేశాడు. దీంతో దాని వెనుక వస్తున్న ఏడుకార్లు వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ​‌‌

ప్రమాదంపై సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement