breaking news
Rajender Nagar
-
Hyderabad: ఓఆర్ఆర్.. వరుసగా ఢీకొన్న ఏడు కార్లు
సాక్షి,హైదరాబాద్: రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏడు కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్లు దెబ్బతిన్నాయి. అందులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. కార్లలోని ప్రయాణికులతో పాటు ఇతర వాహనదారులు గాయపడ్డారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాదం ఆదివారం(అక్టోబర్ రాజేంద్రనగర్ నుంచి అప్పా జంక్షన్ వైపు వస్తుండగా జరిగింది.ఓ కారు డ్రైవర్ మితిమీరిన వేగంతో వెళ్లి ఒక్కసారి బ్రేక్ వేశాడు. దీంతో దాని వెనుక వస్తున్న ఏడుకార్లు వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
సన్ సిటీ క్రాకర్ షాపులో అగ్నిప్రమాదం ఘటనలో మరో కోణం
-
రాజేందర్ నగర్ పోలీసు స్టేషన్లలో కరోనా కలకలం
-
గదిలో బంధించి.. మద్యం తాగించి..
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో మరో అబల ఆక్రందన ఇది. ముంబైకి చెందిన 26 ఏళ్ల యువతిని సెంట్రల్ ఢిల్లీ రాజేందర్ నగర్‌లోని ఓ గదిలో ఇద్దరు వ్యక్తులు బంధించారు. ఆమెతో బలవంతంగా మద్యాన్ని తాగించి.. గత గురువారం మధ్య రాత్రి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకడైన కాంట్రాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు స్థానిక మున్సిపాలిటీలో ఎగ్గిక్యూటివ్ ఇంజినీర్ అని తెలుస్తోంది. అతడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ప్రైవేటు అంగాలలో తీవ్ర గాయాలు కావడంతో బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆమెకు ఓ స్వచ్ఛంద సంస్థతో కౌన్సెలింగ్ కూడా ఇప్పించారు. బాధితురాలితో నిందితులు అసహజ రీతిలో శృంగారానికి పాల్పడ్డారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఘటనకు సంబంధించి రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్లో గ్యాంగ్ రేప్ కేసు నమోదైంది. ఫేస్బుక్లో పరిచయం! బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు, పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం.. ముంబైకి చెందిన ఆమె ఏడు నెలల కిందట ఢిల్లీకి వచ్చింది. ఇక్కడ సఫ్దర్ జంగ్ ప్రాంతంలో అద్దెకు ఉంటోంది. నిందితుడైన కాంట్రాక్టర్ మనీష్ ఆమెకు మొదట ఫేస్బుక్లో పరిచయమయ్యాడు. ఇద్దరు తరచూ చాటింగ్ చేసేవారు. ఆ తర్వాత మొబైల్ నంబర్లు కూడా పరస్పరం ఇచ్చుకొని మాటలు కొనసాగించారు. ఈ క్రమంలో మనీష్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఢిల్లీకి రప్పించాడు. ఢిల్లీకి వస్తే తన ఖర్చులన్నీ భరిస్తానని, తనను చూసుకుంటానని అతడు హామీ ఇచ్చినట్టు ఆమె ఎఫ్ఐఆర్లో తెలిపింది. ఘటన జరిగిన రోజు పెళ్లి గురించి మాట్లాడుదామని బాధితురాలిని మనీష్ తన గదికి పిలించాడు. ఆ సమయంలో అతనితోపాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ వ్యక్తి బాధితురాలిపై బలాత్కరం చేయబోయాడు. దానిని ప్రతిఘటించి మనీష్‌కు తెలుపగా.. అతడు ఆమెను దుర్భాషలాడాడు. ఇద్దరు కలిసి గదిలో ఆమెను బంధించి.. బలవంతంగా మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డారు. అతి కష్టం మీద వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
ఢిల్లోలో కాల్పుల కలకలం