
రసూల్‌పురా: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పలు విశేషాలున్నాయి. చారిత్రక, పర్యాటక ప్రాముఖ్యతలూ ఉన్నాయి. ఇవన్నీ సందర్శకులకు తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఓ కరపత్రాన్ని రూపొందించారు. మంగళవారం రాష్ట్రపతి నిలయంలో జరిగిన కార్యక్రమంలో పరిపాలనాధికారిణి రజని ఈ కరపత్రాన్ని ఆవిష్కరించారు. 97 ఎకరాల్లో ఉన్న రాష్ట్రపతి నిలయంలో ప్రజల కోసం 20 రకాల ప్రత్యేక విశేషాలను తీర్చిదిద్దామని, ఇవి ఆద్యంతం సందర్శకులను ఆకట్టుకుంటాయని రజని పేర్కొన్నారు.
రాష్ట్రపతి నిలయం ప్రజల సందర్శనార్థం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తెరచి ఉంటుందని, విద్యార్థులకు ఉచిత ప్రవేశమని, 20 మంది గైడ్స్ అందుబాటులో ఉంటారని ఆమె వెల్లడించారు. కార్యక్రమంలో అడ్మిన్ అధికారి దులార్ మింగ్, అసిస్టెంట్ అడ్మిన్ అ«ధికారి రాజేష్ యాదవ్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.