
ఏఐ ఆధారిత ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, రంగారెడ్డి: అంగరంగ వైభవంగా ఆ జంటకు వివాహం జరిగింది. అప్పగింతల తర్వాత బారాత్‌లో అంతా హుషారుగా చిందులేశారు. తెల్లవారు జామున వధువుతో పాటు వరుడు తన ఇంటికి చేరుకున్నాడు. అయితే కాసేపటికే గుండెపోటుతో కుప్పకూలి ఆస్పత్రిలో చేరాడు.
వివాహం జరిగిన రెండు రోజులకే వరుడు మృతి చెందిన సంఘటన రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బడంగ్పేట్ లోని లక్ష్మీ దుర్గ నగర్ కాలనీకి చెందిన సాయి అనిల్ కుమార్(26) ఈనెల 7వ తారీఖున వివాహం జరిగింది. ఆ మరుసటిరోజు.. తెల్లవారుజామున వధువుతో ఇంటికి చేరుకోగానే గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు.
అనంతరం పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. వివాహం జరిగిన రెండు రోజులకే వరుడు మృతి చెందడంతో పెళ్ళంట విషాద ఛాయలు అలుముకున్నాయి.

భారత్‌లో ఇటీవల ఆకస్మిక మరణాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. మరీ ముఖ్యంగా 18-45 ఏళ్ల యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు ఆందోళనకు గురిచేస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) పరిశోధనల్లో.. కోవిడ్-19 తర్వాత ఆకస్మిక మరణాలు గణనీయంగా పెరిగాయి. మరీ ముఖ్యంగా 45 ఏళ్ల లోపు వయస్సు గల వ్యక్తులు, ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్యం లేకపోయినా, హఠాత్తుగా మరణించడం గమనార్హం. దీంతో..
పోస్ట్ మార్టం నివేదికల (AIIMS లో 50 కేసులు) ఆధారంగా శరీరంలో మార్పులు, గుండె సంబంధిత సమస్యలు, రక్తనాళాల గడ్డకట్టడం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. కంట్రోల్ గ్రూప్ ద్వారా ఆరోగ్యవంతుల వివరాలు సేకరించి, మరణించిన వారి లక్షణాలతో పోల్చుతున్నారు.
ఆకస్మిక మరణాలకు సాధ్యమైన కారణాలు:
గుండెపోటు (Heart Attack) – ముఖ్యంగా నిదానంగా పెరిగిన కొలెస్ట్రాల్, రక్తనాళాల బ్లాక్‌లు
Arrhythmia – గుండె రిథమ్ సక్రమంగా లేకపోవడం
COVID-19 ప్రభావం – శరీరంలో మైక్రో గడ్డలు, శ్వాసకోశ మార్పులు
ఒత్తిడి, జీవనశైలి సమస్యలు – నిద్రలేమి, మద్యం, ధూమపానం
అధిక వ్యాయామం లేదా శారీరక ఒత్తిడి – కొన్నిసార్లు వ్యాయామం సమయంలో గుండెపై అధిక ఒత్తిడి
నివారణకు సూచనలు
తరచూ ఆరోగ్య పరీక్షలు తరచుగా చేయించుకోవడం
గుండె ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం
కోవిడ్ తర్వాత శరీరంలో మార్పులు ఉంటే వైద్య సలహా తీసుకోవడం
జీవనశైలిని మెరుగుపరచడం (ఆహారం, వ్యాయామం, నిద్ర)