సాక్షి,ములుగు: మేడారం సమ్మక్క-సారక్క జాతరకు ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవుదినం కావడంతో అమ్మవార్లని దర్శించుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా భక్తులు తరలివచ్చారు. దీంతో జిల్లా యంత్రాంగం 200మంది పోలీసులతో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసింది. ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ స్వయంగా భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
వాస్తవానికి సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల జాతర వచ్చే ఏడాది జనవరి 28న సారలమ్మ రాకతో ప్రారంభం అవుతుంది. 29న సమ్మక్క దేవత గద్దెలపైకి వస్తుంది. 30న భక్తులు మెుక్కులు సమర్పించుకుంటారు. 31వతేదీన అమ్మవార్ల వనప్రవేశంతో జాతరముగుస్తుంది.
సమ్మక్కసారలమ్మ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా భావిస్తారు. జాతర సందర్భంలో కోట్ల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ సందర్భంగా ముందుగానే భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఈ ఏడాది అమ్మవార్ల జాతరను ప్రభుత్వం అత్యంత వైభవంగా జరపాలని సంకల్పించింది. జాతర ఏర్పాట్లకోసం ఇప్పటికే ప్రత్యేక నిధులు మంజూరు చేసింది.


