ఈనాడు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు కన్నుమూత Eenadu and Ramoji Film City founder Ramoji Rao passed away this morning in Hyderabad. Sakshi
Sakshi News home page

ఈనాడు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు కన్నుమూత

Published Sat, Jun 8 2024 6:57 AM

Ramoji Rao Passes Away

సాక్షి, హైదరాబాద్‌: ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు  శనివారం ఉదయం కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

మూడురోజుల క్రితం ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేసి స్టంట్స్‌ వేశారు. వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్న రామోజీరావు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌ అమర్చారు. వయోభారంతో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. తెల్లవారుజామున 4.50 గంటలకు తుది శ్వాస విడిచారు.

రామోజీరావు మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. అధికారిక లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌కు సీఎస్ ద్వారా సీఎం ఆదేశాలు జారీ చేశారు.

రేపు రామోజీరావు అంత్యక్రియలు
రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రామోజీరావు భౌతికకాయానికి ప్రముఖులు నివాళులర్పించారు. వెంకయ్యనాయుడు, కేటీఆర్‌, సబితా, జానారెడ్డి,హరీశ్‌రావు రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

రేపు సినిమా షూటింగ్‌లకు సెలవు
రామోజీరావు మృతికి సంతాపంగా రేపు(ఆదివారం) సినిమా షూటింగ్‌లకు సెలవు ప్రకటించినట్లు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ వెల్లడించారు.

రామోజీ మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 1936 నవంబర్‌ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. ఈనాడు దినపత్రికను 1974 ఆగస్టు 10న విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈనాడుతో పాటు ‘సితార’ సినీ పత్రిక నడిపారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఫిల్మ్ సిటీని నిర్మించారు. 2016లో భారత ప్రభుత్వం రామోజీని పద్మవిభూషణ్‌తో సత్కరించింది.

ఇదీ చదవండి: రామోజీరావు మృతిపట్ల ప్రముఖుల సంతాపం

 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement