సాక్షి, మహబూబ్‌నగర్: జురాల ప్రాజెక్టు వద్ద ఆందోళన వాతావరణం నెలకొంది. సాగునీటి కోసం బీఆర్‌ఎస్ నేతలు, రైతులు ఆందోళన చేపట్టారు. ప్రాజెక్టు వద్దకు ర్యాలీగా వెళ్లారు. ఈ నేపథ్యంలో వారిని అడ్డుకోవడానికి పోలీసులు వెళ్లగా వారి వాహనాలను అడ్డగించారు. రోడ్లపై కర్రలు, స్తంభాలను అడ్డంగా నిలిపారు. దీంతో ప్రాజెక్టు వద్ద ఆందోళన వాతావరణం నెలకొంది.
అయితే నిరసన సందర్బంగా జురాల ప్రాజెక్టు వద్దకు వెళ్లడానికి యత్నించిన బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా ప్రాజెక్టు వద్దకు వెళుతున్న రైతులను అడ్డుకోవడంతో అక్కడే ఉన్న సమాంతర కాలువల్లో దిగి నిరసన తెలిపారు. రైతులు, బీఆర్‌ఎస్ నేతల ఆందోళనలతో జురాల ప్రాజెక్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.


