అన్నేశ్వరమ్మ గుట్టపై గుడిసెలు వేసేందుకు యత్నం | Police Stopped Women | Sakshi
Sakshi News home page

అన్నేశ్వరమ్మ గుట్టపై గుడిసెలు వేసేందుకు యత్నం

Sep 7 2023 11:52 AM | Updated on Sep 7 2023 11:55 AM

Police Stopped Women - Sakshi

అన్నేశ్వరమ్మ గుట్ట వద్ద మహిళలను అడ్డుకుంటున్న పోలీసులు

నల్లగొండ: నల్లగొండ పట్టణ పరిధిలోని ఆర్జాలబావి సమీపంలో ఉన్న అన్నేశ్వరమ్మ గుట్టపై గుడిసెలు వేసేందుకు కొందరు పేదలు యత్నించారు. సుమారు 500 మంది మహిళలు గుట్ట చుట్టూ చేరి తమకు నచ్చిన ప్రాంతంలో ప్లాట్లను ఏర్పాటు చేసుకునేందుకు కర్రలు పాతి చీరలు కట్టి ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు.

పోలీసులు, రెవెన్యూ అధికారులు వారికి అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించగా మహిళలు అక్కడే కూర్చున్నారు. దీంతో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గుట్టపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చేసేదేమీ లేక పోలీసులు మహిళలను వాహనంలో ఎక్కించి నల్లగొండ టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తర్వాత వ్యక్తిగత పూచికత్తుపై వదిలిపెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement