పెళ్లి విందులో మటన్‌ ముక్కల లొల్లి! | Mutton curry strikes at a wedding in Telangana | Sakshi
Sakshi News home page

Nizamabad: పెళ్లి విందులో మటన్‌ ముక్కల లొల్లి!

Aug 29 2024 12:14 PM | Updated on Aug 29 2024 1:04 PM

Mutton curry strikes at a wedding in Telangana

పెళ్లి భోజనంలో మాంసాహారం కోసం వరుడు, వధువు తరఫు బంధువులు పరస్పరం దాడులు చేసుకున్న ఘటన నిజామాబాద్‌ జిల్లా నవీపేటలో బుధవారం చోటుచేసుకుంది. 

నవీపేట: మండల కేంద్రంలోని ఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం జరిగిన పెళ్లి విందులో ఇరు వర్గాలకు చెందిన కొందరు పరస్పర దాడులకు పాల్పడడంతో 19 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వినయ్‌కుమార్‌ తెలిపారు. 

భోజనం చేస్తున్న సమయంలో ఒక వర్గానికి చెందిన వారికి సరిగ్గా వడ్డించడం లేదని మరో వర్గానికి చెందిన వ్యక్తులతో ఘర్షణకు దిగారు. ఘర్షణ ముదిరి కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులకు ఫంక్షన్‌ హాల్‌కు చేరుకుని శాంతింపజేశారు. పలువురిపై కేసు నమోదు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement