మెదక్: నర్సాపూర్‌లో విద్యార్థులకు పెనుప్రమాదం తప్పింది. డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో స్కూల్ బస్సు అదుపుతప్పింది. విద్యార్థులను బస్సులో ఇంటికి తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగివున్న గూడ్స్ వెహికిల్తో పాటు, రెండు బైకులను ఢీ కొంది బస్సు. అనంతరం కొద్దీ దూరం బైకుని ఈడ్చుకెళ్లి ఆగిపోయింది.
వెంటనే గమనించి డ్రైవర్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. స్వల్పగాయాలతో బస్‌లోని సుమారు 40 మంది విద్యార్థులు బయటపడ్డారు. ఈ ఘటనతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు స్టూడెంట్స్. సీసీ కెమెరాలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి.
ఇదీ సంగతి: సినీనటుడు గిరిబాబు మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి


