కర్ర సాయంతో కేసీఆర్‌ నడక

MP Santosh Kumar Posted KCR Walking Video Twitter - Sakshi

సాక్షి, సిద్దిపేట: తెలంగాణ మాజీ సీఎం కే. చంద్రశేఖరరావు చేతి కర్ర సాయంతో నడక సాధన చేస్తున్నారు. ఫిజయోథెరపీ వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్‌ అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నారు. గత నాలుగు రోజులుగా సిద్దిపేట జిల్లా మర్కూర్‌ మండలం ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమారు తన  ‘ఎక్స్‌’ ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. 

కాలు తొంటి శ​‍స్త్ర చికిత్స అనంతరం కేసీఆర్‌ హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ నందినగర్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక.. ఇటీవలే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి కేసీఆర్‌ చేరుకున్నారు.

చదవండి:  గవర్నర్ కోటా ఎమ్మెల్సీ భర్తీపై తమిళిసై కీలక ప్రకటన

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top