MLA Poaching Case: SIT Issued Notice Other Five Members - Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేల ఎర కేసు: మరో ఐదుగురికి సిట్‌ నోటీసులు

Nov 25 2022 12:28 PM | Updated on Nov 25 2022 1:54 PM

MLAs Poaching Case: SIT Issued Notice Another Five - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరో అయిదుగురికి సిట్‌ నోటీసులు జారీ చేసింది. కేరళ వైద్యుడు జగ్గుస్వామి సోదరుడు మణిలాల్‌లోపాటు సిబ్బంది శరత్‌, ప్రశాంత్‌, విమల్‌, ప్రతాపన్‌కు నోటీసులు ఇచ్చింది. 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేసింది. ఈసారి కూడా విచారణకు హాజరు కాకుంటే అరెస్ట్‌ చేస్తామని హెచ్చరించింది.

రిమాండ్‌ పొడిగింపు
ఎమ్మెల్యేలకు ఎర కేసులోని ముగ్గురు నిందితుల రిమాండ్‌ గడువు ముగియడంతో వారిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజిలకు వచ్చేనెల 9 వరకు రిమాండ్‌ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించింది.

విచారణకు నందకుమార్‌ భార్య
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో సిట్‌ విచారణ కొనసాగుతోంది. నంద కుమార్ భార్య చిత్ర లేఖ, న్యాయవాదులు ప్రతాప్‌ గౌడ్‌, శ్రీనివాస్‌లు విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులతో సంబంధాలపై సిట్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. బ్యాంక్ ఖాతాలు, లావాదేవీలు.. ప్రతాప్ గౌడ్, నందకుమార్ ట్రాన్సెక్షన్‌పై విచారిస్తున్నారు. రామచంద్ర భారతి, సింహయాజులు తో పరిచయాలపై ప్రశ్నిస్తున్నారు.
చదవండి: మల్లారెడ్డి ఇంటిపై ఐడీ దాడుల్లో కొత్త ట్విస్ట్‌.. 

Advertisement
 
Advertisement
Advertisement