గెలిపిస్తే మంత్రిగా తిరిగి వస్తా: సీతక్క

MLA Seethakka Interesting Comments - Sakshi

మహబూబాబాద్‌: రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అని తనను గెలిపిస్తే మంత్రిగా తిరిగి వచ్చి అభివృద్ధి చేస్తా అని ఎమ్మెల్యే అభ్యర్థి ధనసరి సీతక్క అన్నారు. మంగళవారం మండలంలోని నారాయణపూర్, రామారావుపల్లి, వెంకటేశ్వర్లపల్లి, బుర్గుపేట, రామకృష్ణాపూర్, ఆనందపూర్, పట్వారుపల్లి, లక్ష్మీదేవిపేట గ్రామాల్లో సీతక్క ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చి బీఆర్‌ఎస్‌ తరఫున ప్రచారం చేసి రూ.కోట్లు ఖర్చు చేసిన ములుగులో కాంగ్రెస్‌ పార్టీ విజయం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు నాయిని భరత్‌ సీతక్కకు మద్దతు పలికి ప్రచారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ రాష్ట్ర  కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు మల్లాడి రాంరెడ్డి, మండలాధ్యక్షుడు  సుర్యనారాయణ, నాయకులు బండి శ్రీనివాస్, అయిలయ్య, రవి పాల్గొన్నారు. 

సీతక్కను భారీ మెజారిటీతో గెలిపించాలి
గోవిందరావుపేట: సీతక్కను భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి గనపాక సుధాకర్‌ అన్నారు. మండల కేంద్రంలోని బుస్సాపూర్‌ గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు పాలెం యాదగిరి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు.  

ఏటూరునాగారం: మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క తరఫున మండల నాయకుడు  మనోజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. నర్సయ్య, లక్ష్మణ్, భాగ్య పాల్గొన్నారు.

మంగపేట: మండలంలోని కమలాపురంలో కాంగ్రెస్‌ పార్టీ ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య సమక్షంతో చైతన్య ఆటో యూనియన్‌ మండల అధ్యక్షుడు ఎండి మైమూద్‌ ఆధ్వర్యంలో 70 మంది మంగళవారం రాత్రి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  పార్టీలో చేరిన వారిని సోమయ్య కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు తూడి భగవాన్‌రెడ్డి, నర్సింహారావు, సంపత్, శివ, నూకల రాజేష్, అశోక్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top