మియాపూర్‌ సీఐ సస్పెండ్‌.. కారణం ఇదే.. | Miyapur CI Prem Kumar Suspended By Cyberabad CP | Sakshi
Sakshi News home page

మియాపూర్‌ సీఐ సస్పెండ్‌.. కారణం ఇదే..

Feb 6 2024 11:37 AM | Updated on Feb 6 2024 4:36 PM

Miyapur CI Prem Kumar Suspended By Cyberabad CP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పోలీసు శాఖలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మియాపూర్‌ సీఐ ప్రేమ్‌కుమార్‌ను సీపీ సస్పెండ్‌ చేశారు. సదరు సీఐ ఓ మహిళతో అమర్యాదకంగా ప్రవర్తించిన కారణంగా ఆయనను సస్పెండ్‌ చేసినట్టు తెలుస్తోంది.

వివరాల ప్రకారం.. మియాపూర్‌ సీఐ ప్రేమ్‌కుమార్‌ను సైబరాబాద్‌ సీపీ సస్పెండ్‌ చేశారు. కాగా, తనతో అమర్యాదగా ప్రవర్తించారని ఓ మహిళ సైబరాబాద్‌ సీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో, సదరు మహిళ ఫిర్యాదుపై సీపీ అవినాష్‌ మహింతి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ఆమెతో ప్రేమ్‌కుమార్‌ అమర్యాదగా ప్రవర్తించాడని తేలడంతో సీఐని సస్పెండ్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement