ప్రేమ పేరుతో వల.. బాలికపై లైంగిక దాడి | minor girl who met on Insta | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో వల.. బాలికపై లైంగిక దాడి

Jun 29 2024 9:36 AM | Updated on Jun 29 2024 9:36 AM

 minor girl who met on Insta

    ఇన్‌స్టాలో పరిచయమైన మైనర్‌ బాలిక 

    నిందితుడిపై పోక్సో కేసు నమోదు 

    రిమాండ్‌కు తరలించిన పోలీసులు 

హిమాయత్‌నగర్‌: ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైన ఓ మైనర్‌ బాలికకు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడిన వ్యక్తిని నారాయణగూడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌లో సుల్తాన్‌బజార్‌ ఏసీపీ కె.శంకర్, ఇన్‌స్పెక్టర్‌ యు.చంద్రశేఖర్, అడ్మిన్‌ ఎస్సై జి.నరేష్‌ కుమార్‌తో కలిసి కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడించారు. ఆగాపురాకు చెందిన షేక్‌ అర్బాస్‌(23) బైక్‌ మెకానిక్‌. ఇన్‌స్ట్రాగామ్‌లో 13 ఏళ్ల మైనర్‌ బాలికను పరిచయం చేసుకున్నాడు. ప్రతిరోజూ చాటింగ్‌ చేస్తూ ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పాడు.

 ఈ నెల 24న పాఠశాలకు వచి్చన బాలికను తనతో పాటు గుల్బర్గాకు తీసుకెళ్లాడు. దీంతో బాలిక ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు అఘాపురాకు చెందిన షేక్‌ అర్బాస్‌ బాలికను తీసుకెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారన్న విషయం తెలుసుకున్న నిందితుడు భయంతో బాలికను తన కుటుంబ సభ్యులకు అప్పగించి పరారయ్యాడు. 

బాలికను భరోసా సెంటర్‌కు తరలించి, వాగ్మూలం రికార్డ్‌ చేసిన పోలీసులు నిందితుడు రెండు రోజుల పాటు బాలికతో లాడ్జీలో ఉండి లైంగిక దాడికి పాల్పడ్డాడని గుర్తించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు, శుక్రవారం నాంపల్లి రైల్వేస్టేషన్‌లో షేక్‌ అర్బాస్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ శంకర్‌ తెలిపారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement