తమిళనాడు తరహాలో మినహాయించాలి | Minister KTR's demand on Twitter on the auction of Singareni coal blocks | Sakshi
Sakshi News home page

తమిళనాడు తరహాలో మినహాయించాలి

Apr 9 2023 2:45 AM | Updated on Apr 9 2023 10:28 AM

Minister KTR's demand on Twitter on the auction of Singareni coal blocks - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తమిళనాడు డెల్టా ప్రాంతంలోని మూడు లిగ్నైట్‌ బ్లాకులను వేలం నుంచి మినహాయించిన రీతిలోనే సింగరేణి బొగ్గు బ్లాక్‌లను కూడా వేలం నుంచి మినహాయించాలని ఐటీ పరిశ్రమల మంత్రి కేటీ రామారావు శనివారం ట్విట్టర్‌ వేదికగా డిమాండ్‌ చేశారు. తమిళనాడు ప్రాంతీయ పార్టీల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని లిగ్నైట్‌ గనులను వేలం నుంచి మినహాయించినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి చేసిన ప్రకటనను కేటీఆర్‌ ప్రస్తావించారు.

బొగ్గు గనులను ప్రైవేటీకరించకుండా సింగరేణికే కేటాయించాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ.. తమిళనాడు గనులను వేలం జాబితా నుంచి కేంద్రం తప్పిస్తున్నట్లు వచ్చిన ఓ వార్తను తన పోస్టుకు జత చేశారు. ఒకే దేశంలో ఉన్న రాష్ట్రాలకు వేర్వేరు నిబంధనలు ఎందుకని కేటీఆర్‌ ప్రశ్నించారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు కంపెనీలు ఏవైనా సరే వేలంలో టెండర్లు దాఖలు చేసి బొగ్గు గనులు సొంతం చేసుకోవాల్సిందేనని కేంద్రం మరోసారి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే, స్వచ్ఛందంగా సింగరేణికే కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్‌ చేస్తోంది. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement