ఆధారాలు చూపిస్తే.. రాజీనామా చేస్తా | Minister Adluri Laxman Kumar challenges Harish Rao | Sakshi
Sakshi News home page

ఆధారాలు చూపిస్తే.. రాజీనామా చేస్తా

Jun 17 2026 4:23 AM | Updated on Jun 17 2026 4:23 AM

Minister Adluri Laxman Kumar challenges Harish Rao

హరీశ్‌రావుకు సవాల్‌విసిరిన మంత్రి అడ్లూరి  

రూ.200 కోట్లా..? రూ.2,000 కోట్లా..? రూ.3,000 కోట్లా..?  

ఎంత కుంభకోణం జరిగిందో బీఆర్‌ఎస్‌ క్లారిటీ ఇవ్వాలని ఎద్దేవా  

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యాసంస్థల కొనుగోళ్లకు సంబంధించిన టెండర్లపై మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ చెప్పారు. ఆధారాలతో నిరూపిస్తే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి ప్రజల సమక్షంలోనే మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని హరీశ్‌రావుకు సవాల్‌ విసిరారు. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ముగ్గురు మంత్రులు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సమీక్ష నిర్వహించిన అనంతరమే కొనుగోలు ప్రక్రియ చేపట్టామని తెలిపారు. 

అడ్లూరి మంగళవారం సీఎల్పి లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఒకే అంశంపై బీఆర్‌ఎస్‌ నాయకు లు మూడు రకాల అంకెలు చెబుతున్నారన్నారు. హరీశ్‌రావు రూ.2,000 కోట్ల కుంభకోణమంటే, ప్రవీణ్‌ కుమార్‌ రూ. 3,000 కోట్లు అంటున్నారని, వారి అనుబంధ మీడియా సంస్థలు రూ.200 కోట్ల వ్యవహారమని ప్రచారం చేస్తున్నాయన్నా రు. ఇందులో ఏది నిజమో బీఆర్‌ఎస్‌ స్పష్టత ఇవ్వాలన్నారు. 

హైకోర్టు కూడా టెండర్‌ విధానాన్ని సమరి్థంచింది 
టెండర్లన్నీ ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌ ద్వారా, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల పర్యవేక్షణలో నిర్వహించామని అడ్లూరి చెప్పారు. హైకోర్టు కూడా ఈ విధానాన్ని సమర్థించిందన్నారు. యూనిఫాం వస్త్రం, ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, స్పూన్లు, ట్రంక్‌ బాక్సులు, స్కూల్‌ బ్యాగులు, బూట్లు, సాక్సులు, బెడ్డింగ్‌ మెటీరియల్, నోట్‌బుక్స్, స్టేషనరీ కిట్లు, ట్రాక్‌ సూట్లు, టైలు, బెల్టులు, ఐడీ కార్డ్‌ హోల్డర్లు ఉన్నాయని వివరించారు. అదేవిధంగా బెడ్‌ïÙట్‌ ధర రూ.425 నుంచి రూ.405కు, కార్పెట్‌ ధర రూ.412, టవల్‌ ధర కూడా తగ్గిందన్నారు. 

బెడ్‌షీట్లు 3 లక్షలు, కార్పెట్లు 2.29 లక్షలు, బ్లాంకెట్లు 6.49 లక్షలు, టవల్స్‌ 1,500 కొనుగోలు విలువ రూ.70.86 కోట్లు అని చెప్పారు. ట్రంక్‌ బాక్సులకు ఐదు కంపెనీలు దరఖాస్తు చేశాయని, పోటీ ప్రక్రియలో ధరలను చర్చల ద్వారా తగ్గించామన్నారు. రూ.1,299 నుంచి రూ.1,275గా నిర్ణయించామని చెప్పారు. దీని మొత్తం విలువ రూ.41.40 కోట్లు అని వెల్లడించారు. యూనిఫాం వస్త్రం టెండర్లలో మూడు సంస్థలు పాల్గొన్నాయని, వర్క్‌ ఆర్డర్‌ విలువ రూ.298.10 కోట్లు అని అన్నారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థ టీజీఎస్‌సీవోలకు 60 లక్షల మీటర్ల వస్త్ర సరఫరా బాధ్యత అప్పగించామని తెలిపారు. దీని విలువ: రూ.57.17 కోట్లు అని వెల్లడించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement