
సివిల్ సర్వీస్ ఉద్యోగానికి రాజీనామా చేసే అవకాశం
హనుమకొండ: హనుమకొండకు చెందిన కాకతీయ యూనివర్సిటీ ఎకనావిుక్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ మంద అశోక్‌కుమార్–రజినీదేవి దంపతుల కూతురు అపూర్వ గ్రూప్–1 ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఎంపికయ్యారు. ఈనెల 27న హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఖమ్మం డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్ ఉత్తర్వులు అందుకున్నారు.
ఇప్పటికే యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్‌లో–2022లో అఖిలభారత స్థాయిలో 646వ ర్యాంకు సాధించిన అపూర్వ ప్రస్తుతం ముంబైలో మినిస్ట్రీ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ ఉద్యోగంచేస్తూనే గ్రూప్–1 కూడా రాసి విజయం సాధించి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. ఆమె తల్లి రజినీదేవి భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్ పాఠశాలలో ప్రధానోపా«ధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అపూర్వ భర్త రఘుకార్తీక్ ప్రముఖ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.