క్రీడాపోటీల్లో విద్యార్థినుల ప్రతిభ
పర్వతగిరి: మండల కేంద్రంలోని టీజీటీడబ్ల్యూయూఆర్‌జేసీ (జీ) కళాశాల విద్యార్థినులు పలు క్రీడాపోటీల్లో రాణించారని ప్రిన్సిపాల్ ఎ.శైలజారాణి శుక్రవారం తెలిపారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో ఇటీవల జరిగిన 69వ సెపక్ తక్రా జాతీయ క్రీడాపోటీల్లో (అండర్–19 విభాగం) వి.దివ్య ప్రతిభ కనబర్చింది. అదేవిధంగా 72వ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ సీనియర్ మహిళా విభాగం పోటీల్లో వరంగల్ మూడో స్థానంలో నిలిచింది. ఎల్.స్రవంతి, బి.నాగేశ్వరి అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి కబ డ్డీ పోటీలకు ఎంపికయ్యారు. కాగా, విద్యార్థినులను ప్రిన్సిపాల్ ఎ.శైలజారాణి, వైస్ ప్రిన్సిపాల్ పి.శారద, పీడీ అపర్ణ అభినందించారు.
జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు అనుకావ్యాంజలి
వర్ధన్నపేట: జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సుర అనుకావ్యాంజలి ఎంపికైనట్లు కోచ్ జలగం రఘువీర్ శుక్రవారం తెలిపారు. గత సంవత్సరం నవంబర్ 14 నుంచి 16 వరకు మేడ్చల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఆమె జిల్లా జట్టు తరఫున పాల్గొంది. జట్టును ద్వితీయ స్థానంలో నిలిపి జాతీయస్థాయి సీనియర్ వాలీబాల్ పోటీలకు ఎంపికై ంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పట్టణంలో ఈనెల 4 నుంచి 11వ తేదీ వరకు జరగనున్న పోటీల్లో ఆమె పాల్గొననుంది. ప్రస్తుతం అనుకావ్యాంజలి కేయూలో వ్యాయామ విద్య ఉపాధ్యాయ శిక్షణలో ఉంది. గతంలో 8సార్లు వివిధ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. అనుకావ్యాంజలిని ఉప్పరపల్లి పీఈటీ వీరస్వామి, తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గజ్జెల రమేశ్‌బాబు, ప్రధాన కార్యదర్శి ఎన్వీ హన్మంతరెడ్డి, కోశాధికారి కృష్ణప్రసాద్, గ్రామ సర్పంచ్ సీనపల్లి రాజు అభినందించారు.
108 వాహనంలో ప్రసవం
రాయపర్తి: పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళ 108 వాహనంలో ప్రసవించింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొలన్‌పల్లి గ్రామానికి చెందిన జోగు నవ్య శుక్రవారం పురిటినొప్పులతో బాధపడుతుండగా భర్త ప్రశాంత్ 108కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన 108 సిబ్బంది గ్రామానికి చేరుకొని ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా కొండూరు గ్రామ శివారులోకి రాగానే పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. ఈఎంటీ శ్రీకాంత్, పైలట్ రామకృష్ణ ఆమెకు వాహనంలోనే పురుడు పోయగా ఆడశిశువుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డను వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా 108 సిబ్బందికి నవ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
పాత నేరస్తులపై
నిఘా పెట్టండి
రామన్నపేట: గతంలో చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలపై నిఘా ఉంచాలని సీసీఎస్ పోలీసులను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా.. శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ సిటీ క్రైం స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. సీసీఎస్‌కు చేరుకున్న సీపీకి అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది కిట్ ఆర్టికల్స్, పాత నేరస్తుల ఫొటోలు, స్టేషన్ రికార్డులు పరిశీలించి చోరీల నివారణకు తీసుకుంటున్న చర్యలను సంబంధిత స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చోరీల నియంత్రణ కోసం చేపట్టాల్సిన ముందస్తు చర్యలను అధికారులకు సూచించారు. అనంతరం సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. చోరీ కేసుల్లో జైలుకు వెళ్లి తిరిగి విడుదలైన నిందితుల సమాచారం సేకరించాలని సూచించారు. ఈ తనిఖీల్లో క్రైం అదనపు డీసీపీ బాలస్వామి, ఏసీపీ సదయ్య, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు రాఘవేందర్, రామకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
క్రీడాపోటీల్లో విద్యార్థినుల ప్రతిభ
క్రీడాపోటీల్లో విద్యార్థినుల ప్రతిభ
క్రీడాపోటీల్లో విద్యార్థినుల ప్రతిభ


