నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్
రాయపర్తి: బంధనపల్లిలో శివాజీ విగ్రహానికి నిప్పుపెట్టి ధ్వంసం చేసిన వారిపై చర్య తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ డిమాండ్ చేశారు. జిల్లా నాయకులు, కార్యకర్తలతో కలిసి శుక్రవారం ఆయన గ్రామంలోని శివాజీ విగ్రహాన్ని పాలతో శుద్ధి చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్, జిల్లా ఉపాధ్యక్షుడు కనుకుంట్ల రంజిత్, నాయకులు మాచర్ల దీన్‌దయాళ్, గడల కుమార్, గోకె వెంకటేశ్, కూచన క్రాంతి, ఎనగందుల శ్రావణ్‌కుమార్, బైరి నాగరాజు, నోముల రతన్, మహ్మద్ రఫీ, చింతం రాజు, వంచనగిరి రాజ్‌కుమార్, మామిడాల సతీశ్, బొడకుంట్ల శివశంకర్, వడ్లకొండ రవి, గణేశ్, సందీప్, సుమన్, మహంత్, గ్రామస్తులు పాల్గొన్నారు.


