Malla Reddy College Staff Attends IT Investigation Over College Donations - Sakshi
Sakshi News home page

Malla Reddy: రూ.వందకోట్ల డొనేషన్లు ఎక్కడ దాచారు? 

Nov 30 2022 8:29 AM | Updated on Nov 30 2022 10:02 AM

Malla Reddy College Staff Attends IT Investigation Over College Donations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి మల్లారెడ్డి ఇంటిపై జరిగిన ఐటీ సోదాలకు సంబంధించి ఆ శాఖ అధికారులు మంగళవారం రెండోరోజు కూడా విచారణ కొనసాగించారు. మల్లారెడ్డి ఆడిటర్‌తోపాటు, కాలేజీల ప్రిన్సిపాళ్లు, అకౌంటెంట్లను అధికారులు దాదాపు నాలుగు గంటలపాటు విచారించారు. వైద్య, ఇంజనీరింగ్‌ కళాశాలల్లో విద్యార్థులను చేర్చుకునే సమయంలో ఫీజులు, డొనేషన్లను ఏ రూపంలో తీసుకుంటున్నారు? ఎంత తీసుకుంటున్నారు?

ఎన్నిరకాల ఫీజులు వసూలు చేస్తున్నారంటూ అధికారులు వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. సోదాల్లో లభించిన కీలక పత్రాలు, పెట్టుబడులకు సంబంధించిన ఆధారాల ఆధారంగా ఆడిటర్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కళాశాలలకు మొత్తం ఎన్ని ఖాతాలున్నాయని, ఏ కళాశాలకు ఏయే బ్యాంకుల్లో ఖాతా లున్నాయని కూడా ప్రశ్నించారు. డొనేషన్ల రూపంలో వసూలు చేసిన వందకోట్ల నిధులను ఎక్కడ డిపాజిట్‌ చేశారన్న దానిపైనా ప్రశ్నించినట్లు తెలిసింది. విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజు కట్టించుకుని తక్కువ ఫీజుకు రశీదులు ఇస్తున్నట్లు అధికారుల దృష్టికి వచి్చన నేపథ్యంలో దానిపైనా ఆరా తీశారు. 
చదవండి: తెలంగాణలో జ్యోతిష్యం ప్రకారం ఎన్నికలు: సుప్రీం వ్యాఖ్య

Advertisement
 
Advertisement
Advertisement