
న్యాల్‌కల్ (సంగారెడ్డి జిల్లా): రెండు కళ్లకు గంతలు కట్టుకొని ఇటీవల వినాయక విగ్రహాన్ని తయారు చేసిన ప్రముఖ కళాకారుడు బస్వరాజ్ తాజాగా భవానీ మాత విగ్రహాన్ని కూడా అలాగే తయారు చేసి ఔరా.. అనిపించాడు. సంగారెడ్డి జిల్లా, న్యాల్‌కల్‌కు చెందిన ప్రముఖ కళాకారుడు హోతి బస్వరాజ్ గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ శిల్పకళా వర్క్‌షాప్ నడుపుతున్నాడు.
ప్రస్తుతం గిన్నీస్ బుక్ రికార్డు కోసం ప్రయత్నం చేస్తున్న బస్వరాజ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భవానీ మాత విగ్ర హాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. కళ్లకు గంతలు కట్టుకొని కేవలం 70 నిమిషాల్లో 3 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని తయారు చేశాడు. కళ్లతో చూడకుండా స్పర్శ ఆధారంగా అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.