30 ఏళ్ల క్రితం కబ్జా.. మూడ్రోజుల్లో విముక్తి | Land Occupied 30 years ago | Sakshi
Sakshi News home page

30 ఏళ్ల క్రితం కబ్జా.. మూడ్రోజుల్లో విముక్తి

May 3 2025 7:55 AM | Updated on May 3 2025 7:55 AM

Land Occupied 30 years ago

సాక్షి, హైదరాబాద్‌: ముప్పై ఏళ్ల క్రితమే కబ్జాకు గురైన రూ.40 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమికి మూడు రోజుల క్రితం విముక్తి కల్పించారు రెవెన్యూ అధికారులు. ఇప్పటికే రెండుసార్లు సర్వే చేయడంతో పాటు భూమి చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. సరూర్‌నగర్‌ మండలం లింగోజిగూడ డివిజన్‌ సర్వే నంబర్‌ 86లో 1.21 ఎకరాల ప్రభుత్వ భూమిపై అధికార పార్టీకికి చెందిన ఓ నేత భూమిపై కన్నేశాడు.

 పక్కనే ఉన్న ఓ ప్రైవేటు పట్టాదారును ఉసిగొలిపి ప్రభుత్వ భూమిని పట్టా భూమిలో కలిపేందుకు యత్నంచాడు. ఇప్పటికే ఆ భూమిలో నాలుగు తాత్కాలిక గదులు నిర్మించి, కూలీలకు అద్దెకు ఇచ్చాడు. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలియడంతో ఈ భూమికి విముక్తి కల్పించాలని నిర్ణయించారు.

కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు ఆర్డీఓ వెంకట్‌రెడ్డి సహా తహసీల్దార్‌ వేణుగోపాల్‌ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి మూడు రోజుల క్రితం చుట్టూ హద్దురాళ్లను ఏర్పాటు చేయడంతో పాటు ఫెన్సింగ్‌ వైర్లను చుట్టారు. తాత్కాలిక గదుల్లో అద్దెకున్న వారంతా వారం రోజుల్లో ఖాళీ చేసి వెళ్లిపోయవాల్సిందిగా ఆదేశించారు. ఈ భూమికి సమీపంలో మరో 250 గజాల స్థలాన్ని కూడా అధికారులు కాపాడారు.     

Advertisement
 
Advertisement
Advertisement