రాహుల్‌గాంధీ ద్వంద్వ నీతిపై కేటీఆర్‌ ఫైర్‌ | KTR fire on Rahul Gandhi: Telangana | Sakshi
Sakshi News home page

రాహుల్‌గాంధీ ద్వంద్వ నీతిపై కేటీఆర్‌ ఫైర్‌

Aug 22 2026 5:36 AM | Updated on Aug 22 2026 5:36 AM

KTR fire on Rahul Gandhi: Telangana

రాజ్యాంగ హక్కులు ఢిల్లీ విద్యార్థులకేనా.. తెలంగాణ విద్యార్థులకు వర్తించవా?

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీలో విద్యార్థుల కోసం ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యార్థులపై సాగిస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ నివాసం ముందు ఎప్పు­డు ధర్నా చేస్తారో చెప్పాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీ­చార్జ్‌ను ప్రశ్నిస్తూ బాధితులకు అండగా నిలుస్తు­న్నట్లు రాహుల్‌గాంధీ నాటకాలాడుతు­న్నారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభు­త్వం విద్యా­ర్థులపై లాఠీలు ఝళిపిస్తూ, వారిని ఈడ్చుకెళ్లి, గొంతులు నొక్కేలా దాడులకు పాల్పడుతున్నా రాహుల్‌ ఎందుకు మౌనం వహిస్తున్నారని ‘ఎక్స్‌’ వేదికగా నిలదీశారు. రాజ్యాంగ హక్కులు ఢిల్లీ­లోని విద్యార్థులకేనా.. తెలంగాణ విద్యా­ర్థులకు వర్తించవా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ అధికా­రంలో ఉన్న తెలంగాణలో విద్యార్థుల హక్కులు అణచివేస్తున్నా రాహుల్‌ స్పందించకపోవడం ఆ పార్టీ ద్వంద్వ ప్రమాణా­­లకు నిదర్శనమన్నారు. తెలంగాణలో జరిగిన లాఠీ­చార్జ్‌ను కూడా ఖండించి, బాధ్యులపై చర్య­లు తీసుకోవాలని రేవంత్‌రెడ్డిని డిమాండ్‌ చేయా­లని కేటీఆర్‌ కోరారు. విద్యా­ర్థుల హక్కుల విషయంలో రాజకీయా­లకతీతంగా నిలబడతా­రా.. లేదా కాంగ్రెస్‌ ప్రభు­త్వానికి రాజకీయ రక్షణ కల్పిస్తారా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో విద్యార్థుల కోసం ధర్నా చేసే నైతిక ధైర్యం ఉన్న రాహుల్‌.. తెలంగాణలో కాంగ్రెస్‌ లాఠీలకు గురైన విద్యార్థుల కోసం కూడా అదే పోరాటం చేయా­లని, లేకపోతే విద్యార్థుల పట్ల ఆయనది కపట ప్రేమగానే ప్రజలు భావించాల్సి వస్తుందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement