ఖమ్మంలో విషాదం.. రన్నింగ్‌ బస్సులో డ్రైవర్‌కు గుండెపోటు | Khammam RTC Driver Died With Heart Attack | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో విషాదం: రన్నింగ్‌ బస్సులో డ్రైవర్‌కు గుండెపోటు

Feb 15 2024 9:14 AM | Updated on Feb 15 2024 10:08 AM

Khammam RTC Driver Died With Heart Attack - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ప్రయాణికుల భద్రతే తనకు ముఖ్యమని భావించిన ఆయన.. ఛాతీలో నొప్పిని ఓర్చుకుంటూ.. 

ఖమ్మం: జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్‌ కన్నుమూశాడు. సత్తుపల్లి నుంచి ఖమ్మం బయల్దేరిన బస్సులో డ్రైవర్‌ శ్రీనివాసరావుకు ఛాతీలో నొప్పి వచ్చింది. అయితే ఆయన ఆలస్యం చేయలేదు.

ప్రయాణికులతో ఉన్న ఆ బస్సును వెంటనే పక్కకు ఆపారు. ఆపై దగ్గరిలోని ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ  ఆయన కన్నుమూశారు. గుండెపోటుతోనే ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాసరావు స్వస్థలం వేంసూరు మండలం రామన్నపాలెంగా తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement